Header Banner

బీర్‌ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా.? శరీరంలో జరిగే మార్పులు ఇవే.! అసలు విషయం ఏంటంటే.!

  Sat Mar 08, 2025 10:00        Health

బీరు తాగిన వెంటనే ఆ పానీయం అన్నవాహిక గుండా నేరుగా పొట్టలోకి వెళ్తుంది. ఆ తర్వాత బీర్‌లోని ఆల్కహాల్‌ నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆల్కహాల్‌ నూ మిగిలిన దాన్ని పేగులు పీల్చుకుంటాయి. బీర్‌లోని ఆల్కహాల్‌ రక్తం ద్వారా లివర్‌ను చేరుకుంటుంది. అక్కడ విచ్చిన్నమవుతుంది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో అసిటేట్, అసిటాల్టిహైడ్ అనే వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఈ వ్యర్థపదార్థాలు కొవ్వును కరగడాన్ని అడ్డుకుంటాయి. ఇదే సమయంలో బీరులో ఉండే మరో పదార్థమైన ఎసిటైల్ CoA నుంచి కొవ్వు ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. రోజూ బీరు తాగేవారిలో పైన చెప్పిన ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొవ్వు కరగకపోవడంతో, కొవ్వు పేరుకుపోవడం కూడా జరుగుతుంది. బీరు తాగితే పొట్ట పెరగడానికి ప్రధాన కారణం ఇదేనన్నమాట. అంతేకాకుండా బీరులో అధిక కేలరీలు ఉంటాయి. ఈ కేలరీలు కొవ్వుగా మారుతాయి. ఇది కూడా పొట్ట రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక బీర్‌ తాగినప్పుడు శరీరంలో మొదట ఆల్కహాల్‌ను కరిగించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఫలితంగా, మిగతా ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకుండా కొవ్వుగా మారతాయి. బీర్‌ తాగితే సహజంగానే ఆకలి ఎక్కువ అవుతుంది. దీంతో తెలియకుండానే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్‌, నూనె వంటలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట పెరుగుతుంది. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #HealthCare #LifeStyle #Sunrise #SunriseForHealth #healthtips #TipsForHealth #SleepingProblem